Friday, February 02, 2007

ఆలూ పరోఠాకావలసినవి: గోధుమ పిండి బంగాళదుంపలు ఉల్లిపాయలు పసుపు కారం/పచ్చి మిరప కాయలు (చాప్డ్) ఉప్పు అల్లం వెల్లుల్లి గరం మసాలా నూని వెన్న చేసేవిధానం:
ముందుగా బంగాళదుంపలు ఉడికించి తొక్క తీసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరువాత బాణలిలో కొంచెం నూనివేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. దానికి పసుపు, కారం/చాప్డ్ మిర్చి, ఉప్పు, గరం మసాల వేసి కొతసేపు వేయించి తరువాత్ దానికి ఉడికించి పెట్టుకున్నా బంగాళదుంపలు కలిపి మరొక రెండు/మూడు నిమషాలు ఉంచి దించేయాలి. అప్పుడు బంగాళదుప కూర(లా) తయారవుతుంది.
తరువాత గోధుమ పిండి కలిప్లి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలని ఒక్కొక్క దాన్ని తీసుకొని వాటిమధ్యలో బంగాళదుంప కూర పెత్తి రొట్టెల పీట మీద వత్తుకొని, పెనం మీద వెన్నతో కాల్చితే ఆలు పరోఠా రెడీ. ఆలూ పరోఠా తో పెరుగు నంచుకుని తింటే బాగుంటుంది.

No comments: